ముంబయి: నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు సెల్ ఫోన్ తోనే పయనిస్తున్నారు యూజర్లు. వినోదం, విజ్ఞానం అందించేవి... అనవసరమైన విషయాల వైపు మొగ్గు చూపే యాప్స్ కూడా అనేకం అందుబాటులో ఉన్నాయి. దీంతో సెల్‌ను యువత పాలిట భూతంగా వర్ణిస్తున్నారు. దీనికి అనేక కారణాలున్నాయి. అవసరం లేకపోయినా సెల్ఫోన్లో ఎక్కువ సేపు మాట్లాడటం.. గంటల తరబడి ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్‌లో చాటింగ్స్ చేయడం... రాత్రంతా ఫోన్‌ను పక్కన పెట్టుకుని యూట్యూబ్‌లో వీడియోలు చూస్తున్నారు. అంతేకాకుండా కరోనా కారణంగా కూడా టెక్నాలజీ వినియోగంలో భాగంగా స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగిపోయింది. ముఖ్యంగా లాక్ డౌన్ అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ లాంటి ఓటీటీ ఫ్లాట్ ఫాంల రాక మరో సంచలనం అయింది. దీంతో యాప్స్ వినియోగం భారీగా పెరిగిపోతున్నట్లు అన్నీ యాప్ అభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతో ఎక్కువ సేపు మొబైల్‌తో పాటు యాప్స్‌ను వినియోగిస్తున్న ప్రపంచ దేశాల సరసన భారత్ చేరింది. ఇటీవల మొబైల్ రీసెర్చ్ సంస్థ 'అన్నీ యాప్' (Annie App)ఇంటర్నెట్లో ప్రపంచ దేశాల ప్రజలతో పాటు భారతీయులు ఎంత సేపు యాప్స్‌పై గడుపుతున్నారనే అంశంపై స్టడీ చేసింది. ఈ స్టడీలో భారతీయులు యాప్స్‌లలో ప్రతీరోజూ 4.8గంటలు గడిపేస్తున్నట్లు తేలింది. యాప్స్ ఎక్కువ వినియోగిస్తున్న దేశాల్లో ఇండోనేషియా(5.5గంటలు), బ్రెజిల్ (5.4గంటలు), సౌత్ కొరియా(5.0గంటలు), ఇండియన్స్ (4.8గంటలు) తొలి స్థానాల్లో ఉండగా.. తరువాత జపాన్, కెనడా, యూఎస్, రష్యా, టర్కీ, యూకే దేశాలున్నాయి.










