ప్రజాశక్తి-అనంతపురం : అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. రోజువారి కూలీగా బాలాజీ దాల్ (పొప్పుల ఫ్యాక్టరీ)మిల్లు నందు పనిచేయుచున్న తలారి నగ్మా (30సం, W/o తలారి రఘు) రోజు ఐదు గంటల సమయంలో ఫ్యాక్టరీ నుండి కూలి పని ముగించుకొని ఇంటికి వస్తూ ఉండేది. కానీ శనివారం సాయంత్రం 6 గంటలు సమయం గడిచిన ఇంటికి రాకపోవడంతో భర్త అనుమానం వచ్చి ఫ్యాక్టరీ వద్దకు వెళ్లి మా భార్య ఇంటికి రాలేదని యాజమాన్యాన్ని అడిగితే యాజమాన్యం మీ భార్య ఇంతకు మునిపే ఇంటికి వెళ్లిందని చెప్పారు. అనుమానం వచ్చి అ క్కడే ఉన్న సిబ్బందిని అడగగా 'మీ భార్య చనిపోయినదని' విషయము తెలిపారు. దీంతో భర్తతో పాటు వాళ్ళ బంధువులు ఫ్యాక్టరీ వద్దకు వచ్చారు. లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంతో గేట్ ని తోచుకుంటూ లోపలికి వెళ్లి చూడగా అమ్మాయి చనిపోయిందని నిర్ధారించారు. యాజమాన్యం పైన మాకు అనుమానాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతురాలకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. యాజమాన్యం దొడ్డిదారిన పారిపోయారని ఆమె భర్త తెలిపారు. అంతేకాదు ఇక్కడ అక్రమంగా 5 ఫ్యాక్టరీలు నడుపుతున్నారని స్థానికులు తెలియజేశారు. ఇక్కడ ఎలాంటి ఫ్యాక్టరీ నేమ్ బోర్డులు కూడా లేవు. కార్మికులకు ఎలాంటి సెక్యూరిటీ కూడా లేదని కానీ సెక్యూరిటీ కెమెరాలు అయితే ప్రతి చోటా అమర్చారని వారు వాపోయారు. సంఘటన స్థలానికి బుక్కరాయసముద్రం పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపట్టారు.










