- నెట్ బాల్ సంఘం అధ్యక్షుడు నాగేశ్వరబాబు
ప్రజాశక్తి-కర్నూలు స్పోర్ట్స్ : జాతీయ స్థాయి నెట్ బాల్ పోటీల్లో కర్నూలు జిల్లా క్రీడాకారులు విజయం సాధించాలని జిల్లా నెట్ బాల్ సంఘం అధ్యక్షుడు నాగేశ్వరబాబు ఆకాంక్షించారు. హర్యానాలోని సోనేపట్ లో ఈనెల 21 నుంచి 24 వరకు జరుగనున్న 9వ జాతీయ స్థాయి మహిళల సీనియర్ నెట్ బాల్ టోర్నమెంట్ లో పాల్గొనడానికి జిల్లా నుంచి క్రీడాకారిణులను ఎంపికైనరని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారిణులు పతకాలతో తిరిగి రావాలని ఆయన ఆకాంక్షించారు. నెట్ బాల్ సంఘం ఉపాధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది ఆనందరావు మాట్లాడుతూ నెట్ బాల్ క్రీడాకారులకు అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పారు. సంఘం ఫౌండర్ , ఈ సందర్బంగా జిల్లా నుంచి ఎంపికైన సుమాంజలి ( కృష్ణగిరి), స్వాతి ( ఆదోని), కీర్తి ( మిడుతూరు), మౌనిక ( పంచలింగాల)లను క్రీడా సంఘాల ప్రతినిధులు అభినందించారు. ఈ కార్యక్రమంలో బాలాజీ, గీతాంజలి, సుమలత, సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.










