Sep 24,2021 18:08

వాట్సాప్‌ మరో సరికొత్త ఫీచర్‌తో ముందుకు రాబోతున్నట్లు సమాచారం. వాట్సాప్‌ పేమెంట్స్‌ వినియోగించిన వారిని ప్రోత్సహించేలా క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తొలుత వాట్సాప్‌ బీటా వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ టెస్టింగ్‌ దశలో ఉన్నట్లు సమాచారం. అయితే, ఈ ఆఫర్‌ కేవలం యూపీఐ పేమెంట్స్‌కి మాత్రమే వర్తించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త ఫీచర్‌పై వాట్సాప్‌ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. వాట్సాప్‌ పేమెంట్స్‌ పేరిట ఆన్‌లైన్‌ చెల్లింపుల వ్యవస్థని ప్రారంభించిన సంగతి విదితమే.