Jun 03,2023 15:57
  •  వెంకటాద్రి గ్రీన్స్ కంపెనీ అధినేత శంకర్

ప్రజాశక్తి-హిందూపురం : సంస్థ అభివృద్ధికి శ్రమించిన ప్రతి ఒక్కరిని గుర్తించి వారిని అన్ని విధాల ఆదుకుంటామని వెంకటాద్రి గ్రీన్స్ కంపెనీ అధినేత శంకర్ పేర్కొన్నారు. వెంకటాద్రి గ్రీన్స్ కంపెనీ ఆధ్వర్యంలో హిందూపురం పట్టణం, రూరల్ మండలం కిరికెర, పరిగి సమీపంలో తదితర ప్రాంతాలలో వెంచర్లను వేయడం జరిగింది. సంస్థలు పనిచేసే ఉద్యోగులందరికీ అధినేత శంకర్ ఉచితంగా ఇంటి స్థలాలను వారి పేరున రిజిస్టర్ చేసి శనివారం అందరికీ అందించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతు సంస్థలు పనిచేసే ఉద్యోగులందరూ తమతో సమానంగా ఉండాలని సంకల్పించి లక్షలు విలువ చేసే ఇంటి స్థలాలను అన్ని ఖర్చులను భరించి రిజిస్టర్ చేసి వారికి ఉచితంగా అందించామన్నారు. దీంతో పాటు ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులందరికీ వైద్య సౌకర్యం, వారి పిల్లల విద్యాభివృద్ధికి చేయూతనందించామన్నారు. ఇకముందు కూడా సంస్థ అభివృద్ధికి కృషి చేసి, తమతో పాటు ఉద్యోగులు కూడా ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో కంపెనీ యాజమాన్యంతో పాటు ఉద్యోగులు పాల్గొన్నారు.