Sep 19,2023 15:33

ప్రజాశక్తి-బొమ్మనహల్ : మండలంలోని బొల్లనగుడ్డం గ్రామములో హెచ్ ఎల్ సి సాగునీరు అందలేదని రైతులు మిరప చెట్లను కాపాడుకోవడానికి ఒక్కొక్క చెట్టుకు ఒక లీటర్ నీళ్లు డబ్బాలతో పోసి కాపాడుకోవలసిన దుస్థితి ఏర్పడిందని బొల్లనగుడ్డం గ్రామ రైతు మారన్న అన్నారు. అతను విలేకరులతో మాట్లాడుతూ హెచ్ ఎల్ సి కాలువ నుండి తొమ్మిదవ డిస్ట్రిబ్యూటర్ చివరి ఆయకట్టు 2 600 ఎకరాలు భూమి కలదు సాగు భూములకు ఒక్క ఎకరాకు కూడా ఇంతవరకు సాగునీరు అందించడంలో అధికారులు విఫలమైనారని ఆ గ్రామానికి చెందిన రైతులు ఆరోపించారు. గత నెల రోజుల క్రితం కురిసిన వర్షానికి విత్తనాలు నాటాము అవి మొలిసాయి. అప్పటినుండి ఇప్పటివరకు సాగునీరు అందకపోవడంతో ప్రతి రైతు నలుగురు కూలీలను ఎద్దులు బండి డ్రమ్ముల్లో నీళ్లు పెట్టుకుని చెట్టుకు ఒక లీటర్ వంతున నీరువేస్తూ పోషిస్తున్నామన్నారు. ఇలాంటి దుస్థితికి రావడానికి కారణం ప్రధానంగా హెచ్ఎల్సీ అధికారులే అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వంచన చేయడం ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడం సాగునీరు పొలాలకు రాకపోవడం వల్ల రైతులు పలు కష్టాలకు గురవుతున్నామన్నారు. అప్పులు చేసి బ్యాంకుల్లో రుణాలు తెచ్చి పంట సాగు చేస్తున్న రైతులకు ఒకవైపు వర్షం రాకపోవడం ఒకవైపు సాగునీరు అందకపోవడం దిక్కు తోచని స్థితిలో ఉన్న రైతులు కూలీల పెట్టి మిరప చెట్లకు నీళ్లు పోయవలసిన దుస్థితి ఏర్పడింది అన్నారు. పంట పండితే గాని రైతు బతుకు లేదు అధికారులకు జీతాలు వస్తాయి కానీ కాలువపై అధికారులు రారు జేఈలు డీలు కొంతమంది బినామీలను పెట్టుకుని వారు కాలువపై రాకుండా రైతులకు సాగునీరు అందక లస్కర్లు లేకపోవడం రైతులు కష్టాలు వర్ణననితంగా మారాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.