Jul 17,2023 16:56

ప్రజాశక్తి-ఆదోనిరూరల్ : గ్రామాల్లో గుక్కెడు తాగునీటి కోసం ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. నిత్యం తాగునీటి సమస్యతో అవస్థలు పడుతున్నారు. నీటి కుంటలు, వ్యవసాయ బోరు నీరే దిక్కు అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదోని మండలం సంతే కుడ్లూరు గ్రామంలో గత 20 రోజుల నుండి త్రాగునీరు అందక ప్రజలు నానా అవస్థలు పడుతున్న పరిస్థితి నెలకొంది. మరి ఇదే గ్రామానికి సంబంధించిన వారు ఆదోని మండల పరిషత్ కు అధ్యక్షురాలుగా ఉన్న, వారు దృష్టి పెడితే సాధ్యం కాదా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి మా గ్రామానికి త్రాగునీటి సమస్య లేకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో గ్రామాలలో రోజులుగా తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నీటికంట నుంచి ఎద్దుల బండ్లు, సైకిళ్లపై నీరు తెస్తున్నామని గ్రామస్తులు తెలిపారు.