వన్డే ప్రపంచకప్ 2023లో వరుణుడు బోణీ కొట్టాడు. తిరువనంతపురం వేదికగా సౌతాఫ్రికా-ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఇవాళ జరగాల్సిన వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. తిరువనంతపురంలో ఇవాల్టి ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో అంపైర్లు తప్పనిసరి పరిస్థితుల్లో మ్యాచ్‌ను రద్దు చేశారు. సౌతాఫ్రికా తమ వరల్డ్‌కప్ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 7న ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో సఫారీలు శ్రీలంకను ఢకొీంటారు. దీనికి ముందు ఆ జట్టు మరో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 2న సఫారీలు ఇదే తిరువనంతపురంలో న్యూజిలాండ్‌ను ఎదుర్కొంటారు. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ వరల్డ్‌కప్‌లో తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 7న ఆడనుంది. ధర్మశాలలో జరిగే ఆ మ్యాచ్‌లో ఆఫ్ఘన్లు.. బంగ్లాదేశ్‌ను ఢకొీంటారు. దీనికి ముందు ఆఫ్ఘన్ టీమ్ మరో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 3న వీరు గౌహతిలో శ్రీలంకను ఢకొీంటారు.










