ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఆంధ్రప్రదేశ్ బాడ్మింటిన్ సంఘం రెండు రోజుల పాటు తిరుపతిలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి అండర్ -19 బాల బాలికల-సింగిల్స్, డబల్స్ ఈ పోటీలకు మన జిల్లా నుండి 10 మంది క్రీడాకారులు హాజరయ్యారు. వారిలో కే.పవన్, కె ముకేష్ కుమార్, ఏ.భారద్వాజ, బి.సూర్య కిరణ్, వి.పవన్ కుమార్, వి.జాహ్నవి, కే.ప్రజ్ఞనాయుడు, బి.హారిక, పి.మౌనిక, జే.శ్రియ దేవి లు హాజరయ్యారు. ఈ బృందానికి మేనేజర్ గా జె.విజయ రామ రాజు, కోచ్ లుగా ఎస్.శ్రీనివాస్, అర్.మోహనరావు వ్యవహరించనున్నారు. క్రీడాకారులకు ప్రవేశ రుసుము, రిజిస్ట్రేషన్ రుసుము - విజయనగరం జిల్లా బాడ్మింటన్ సంఘం చెల్లించడమైనది. వీరికి టీ షర్ట్ లు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ సీఈఓ బహుకరించారు.










