ప్రజాశక్తి-పుట్లూరు : మండల కేంద్రంలోని బస్టాండ్ సర్కిల్ నందు శనివారం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం 22వ రాష్ట్ర మహాసభల పోస్టర్లు రిలీజ్ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి డి.పెద్దయ్య మాట్లాడుతూ వ్యవసాయ ప్రధానంగా ఉన్న మన రాష్ట్రంలో గ్రామీణ ప్రజల్లో అత్యధికులు వ్యవసాయ కూలీలుగా జీవిస్తున్నారు. వీరిలో దళితులు, మైనార్టీలో వెనుకబడిన కులాల తదితర పేదలు చెమటోడ్చి కష్టించి పని చేసే శ్రమే దేశ సంపదకు మూలం. కరువు కోరల్లో కొట్టుమిట్టాడుతూ తరతరాలుగా అణిచివేతకు గురవుతూ అంటరానితనంలాంటి సాంఘిక పీడన న్యాయమైన కూలి రేట్లు ఇవ్వాలని భూస్వామ్య పెత్తందారి దోపిడీల నుండి విముక్తి కోసం "పనిమనిషి పనిమనిషిగా చూడాలని" సాంఘిక న్యాయం కోసం 90 సంవత్సరాల క్రితం అమరులు పుచ్చలపల్లి చంద్రయ్య స్వగ్రామంలో వ్యవసాయ కూలీ సంఘం ఆవిర్భవించి తెలుగు నాట ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా విస్తరింపబడి జమీందారీ ,జాగీర్దారీ విధానాలు రద్దుకు భూస్వామ్య పెత్తందారి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా న్యాయమైన కూలి రేట్ల సాధనకు, భుక్తి కోసం. సామాజిక గౌరవం కోసం దీన్నే వాడిదే భూమి అనే నినాదంతో నైజాం నవాబుల నిరంకుశ పాలనకు భూస్వాములకు వ్యతిరేకంగా గ్రామీణ శ్రమజీవులను సమీకరించి వారిని చైతన్య పరిచి మహోద్యమంలో నిర్వహించి విజయాలను సాధించింది. అన్ని రకాల ప్రభుత్వ బంజరు భూములు మిగులు భూముల కోసం ప్రత్యక్ష భూ పోరాటాలు నిర్వహించి లక్షలాది ఎకరాలని సాధించడం జరిగినది. చట్టబద్ధంగా భూస్వాముల మిగులు భూములు పేదలకు దక్కాలని భూ సంస్కరణల యాత్రలు నిర్వహించి చట్టంగా సాధించిన ఘనత ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘానికే దక్కింది.










