న్యూఢిల్లీ : ఛత్తీస్‌గఢ్ బిజెపి సీనియర్ నాయకుడు, ఎస్‌టి జాతీయ కమిషన్ మాజీ చైర్మన్ నందకుమార్ సాయి బిజెపిని వీడారు. ఛత్తీస్‌గఢ్ యూనిట్‌లోని తన సన్నిహితులు తప్పుడు ఆరోపణలతో తన గౌరవానికి భంగం కలిగించారని ఆరోపించారు. పార్టీ సభ్యత్వంతో పాటు అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్ బిజెపి చీఫ్‌గానే కాకుండా 1997 నుండి 2000 మధ్య అవిభక్త మధ్యప్రదేశ్ యూనిట్ బిజెప అధ్యక్షునిగా కూడా ఉన్నారు. పార్లమెంట్ ఉభయ సభల సభ్యునిగా కూడా పనిచేశారు. నందకుమార్ సాయి కాంగ్రెస్‌లో చేరేనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలను కాంగ్రెస్ నేతలు స్వాగతించారు.










