ప్రజాశక్తి - కర్నూలు జిల్లాపరిషత్ : లయన్స్ ఇంటర్నేషనల్ 316జే జిల్లా కాబినెట్ కార్యదర్శిగా లయన్ ఎన్ వేంకటరామరాజు ను నియమించినట్లు 316 జే జిల్లా గవర్నర్ లయన్ నాగేశ్వరరావు యాదవ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా లయన్ వేంకటరామరాజు మాట్లాడుతూ తనకు లభించిన ఈ అవకాశాన్ని సధ్వినియోగం చేసుకొని, లయన్స్ క్లబ్ సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరింప జేస్తామని తెలిపారు. జిల్లాలో డైలాసిస్ సేవలు అందించడానికి కృషి చేస్తానని తెలిపారు. తనకు ఈ అవకాశం కల్పించిన జిల్లా గవర్నర్ లయన్ నాగేశ్వరరావుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.










