ఇంటర్నెట్‌డెస్క్ : ట్విటర్ ఖాతాదారులకు మరింత చేరువయ్యేలా... భద్రతా ప్రమాణాలను అనుసరిస్తూ.. సరికొత్త నిర్ణయాల్ని తీసుకుంటోంది. ట్విటర్ ఖాతాదారులు తన వ్యక్తిగత అనుమతి లేకుండా.. ఎవరైనా ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తే.. ట్విటర్ వాటిని నిషేధించనుంది. ఈ మేరకు మంగళవారం ట్విటర్ ఇన్ఛార్జ్ తెలిపారు. వీటికి సంబంధించి 'ట్విటర్ ఖాతాలో.. తమ వ్యక్తిగత ఇష్టానుసారంగా లేకుండా.. ఎవరైనా సరే ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేస్తే.. వాటిని గుర్తించి ఆ ట్విటర్ వినియోగదారులు మాకు చెబితే మేము వాటిని తీసివేస్తాము' అని ట్విటర్ బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది.
సోషల్ మీడియా గోప్యతా విధానం వల్ల ఫోన్ నంబర్లు, చిరునామాలు, ఐడిలు వంటి ఇతర వ్యక్తుల ప్రైవేట్ సమాచారాన్ని పోస్ట్ చేయడాన్ని ట్విటర్ ఇప్పటికే నిషేధించింది. ఇక ట్విటర్ కంపెనీ చీఫ్ జాక్ డోర్సే తమ పదవి నుంచి వైదొలగి.. కొత్త సిఈవో పరాగ్ అగర్వాల్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు.










