Oct 26,2023 22:05

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతీ రోజు తమకు అవకాశం ఉన్న సమయంలో వ్యాయామం చేయడం అలవర్చుకోవాలని, తద్వారా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ప్రముఖ ఆడిటర్‌ వి.భాస్కరరామ్‌ అన్నారు. స్థానిక ఎవి అప్పారావు రోడ్డులోని కోదండ రామాలయం ఎదురుగా ఉన్న సత్య క్లాసిక్‌ అపార్ట్‌మెంట్‌లోని 6వ అంతస్తులో ఏర్పాటు చేసిన ''బిల్ట్‌'' ఫిట్‌నెస్‌ సెంటర్‌ను ఆయన గురువారం పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోజును ఉల్లాసంగా, ఉత్సాహంగా ప్రారంభించాలంటే రోజులో కనీసం ఒక గంటైనా వ్యాయామానికి సమయం కేటాయించాలన్నారు. అందుకు అనువైన స్థలం ఎవి అప్పారావు రోడ్డులోని నూతనంగా ఏర్పాటు చేసిన బిల్ట్‌ ఫిట్‌నెస్‌ సెంటర్‌ అని అన్నారు. బిల్ట్‌ ఫిట్‌నెస్‌ సెంటర్‌ నిర్వాహకులు రవికుమార్‌, అరుణ్‌, విక్రమ్‌ మాట్లాడుతూ తమ ఫిట్‌నెస్‌ సెంటర్లో అనుభవం, ప్రతిభ కలిగిన ట్రైనర్స్‌ ఉన్నారని, తమ ఫిట్‌నెస్‌ సెంటర్‌కు వచ్చే వారికి వారితోనే శిక్షణ ఇవ్వబడుతుందన్నారు. నేటి తరానికి తగ్గట్టుగానే అధునాతన పరికరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తమ ఫిట్‌నెస్‌ సెంటర్‌కు వచ్చే వారికి అతి తక్కువ ఫీజులో ప్రొఫెషనల్‌ ఫిట్‌నెస్‌ ప్లాన్లను అందిస్తున్నామన్నారు. ఆరోగ్యం, పౌష్టికాహారానికి సంబంధించిన సలహాలు, సూచనలు ఇవ్వబడతాయని తెలిపారు.