Sep 08,2023 20:02

దాణాను పంపిణీ చేస్తున్న డాక్టర్‌ అశోక్‌ కుమార్‌

ప్రజాశక్తి - మంత్రాలయం
పశువులకు వచ్చే వ్యాధులపై పెంపకందారులు అప్రమత్తంగా ఉండాలని పశుసంవర్థక శాఖ వైద్యులు డాక్టర్‌ అశోక్‌ కుమార్‌ సూచించారు. శుక్రవారం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు మండలంలోని కలుదేవకుంట గ్రామంలో పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ పశు వైద్య కేంద్రంలో 'పశు విజ్ఞానబడి' నిర్వహించారు. కలుదేవకుంట ప్రాథమిక సహకార సంఘం ఛైర్మన్‌ కె.రఘునాథ్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడారు. వర్షాకాలంలో పశువులకు వచ్చే వ్యాధులు, వాటి నివారణ చర్యల గురించి అవగాహన కల్పించారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు పశువులకు అవసరమైన పశుగ్రాసాలను సాగు చేసుకోవాలని తెలిపారు. శాస్త్రీయ పద్ధతుల్లో పొదుపుగా వాడుకొని రైతులు పాల దిగుబడి ఏ విధంగా పొందాలో వివరించారు. రైతులకు 20 యూనిట్ల సంపూర్ణ మిశ్రమ దాణాను సబ్సిడీపై మంజూరు కాగా పంపిణీ చేశారు. వరప్రసాద్‌ పాల్గొన్నారు.