Jul 10,2023 21:32

ర్యాలీ నిర్వహిస్తున్న చేనేత వస్త్రవ్యాపారులు

ప్రజాశక్తి ధర్మవరం టౌన్‌ : విజయవాడ ఘటనకు నిరసనగా వస్త్రవ్యాపారులు సోమవారం స్వచ్చందంగా దుకాణాలను బంద్‌ చేసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ముందుగా నేసేపేటలోని షాపులన్నీ బంద్‌ చేసి. తరువాత శమీనారాయణస్వామి గుడి వద్ద నుండి ర్యాలీగా కళాజ్యోతి సర్కిల్కు చేరుకుని అక్కడే ఉన్న డీఎస్సీ కార్యాలయంలో డీఎస్సీ శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా చర్యలుతీసుకోవాలని వారు డీఎస్పీని కోరారు. అనంతరం ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి ఆర్డీవో తిప్పేనాయక్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ ర్యాలీకి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి చిలుకం మధుసూదన్‌ రెడ్డి తన సంఘీబావాన్ని తెలిపారు. ఈ ర్యాలీలో వస్త్ర వ్యాపారులు గిర్రాజు నగేశ్‌, గిర్రాజు రవి, పోలా వెంకటనారాయణ, గిర్రాజు శశి, కోటం ఆనంద్‌, ఉడుముల రాము,గుండా పుల్లయ్య, రంగం రామకృష్ణ, కొండమీద రాయుడు, జింకాచంద్ర, మెటికలకుళ్లాయప్ప, కలవల రాంకుమార్‌, పోలారామాంజనేయులు, కాచర్ల అంజి, శంకర తేజశ్వర్‌, శంకర యుగంధర్‌, చెలిమి పెద్దన్న, ఇటికంటి మహేశ్‌, దత్తశివ తదితరులు పాల్గొన్నారు.