ప్రజాశక్తి - మంత్రాలయం
టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా యువత చేపట్టిన రిలే నిరాహార దీక్షలు వర్గంలోనూ కొనసాగాయి. సోమవారం చంద్రబాబుకు మద్దతుగా 'మేము సైతం' అంటూ టిడిపి ఇన్‌ఛార్జీ పాలకుర్తి తిక్కారెడ్డి ఆధ్వర్యంలో తెలుగు యువత, టిఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు 6వ రోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఐటి, సాఫ్ట్ వేర్ రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన విజన్ ఉన్న మహా నేత చంద్రబాబు అని కొనియాడారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అక్రమంగా అరెస్టు చేసిన చంద్రబాబును విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు బయటికొచ్చే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. ఈ దీక్షకు మద్దతుగా నియోజకవర్గ పరిశీలకులు శివబాల, టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షులు పన్నగ వెంకటేష్ స్వామి, బీసీ సెల్ అధ్యక్షులు మాధవరం అమర్‌నాథ్ రెడ్డి, కోసిగి మండల కన్వీనర్ జ్ఞానేష్ పూలమాలలు వేసి సంఘీభావం తెలిపారు. తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్ రెడ్డి, నియోజకవర్గ అధ్యక్షులు బాపురం సుధీర్ రెడ్డి, టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చూడి శివమూర్తి, జిల్లా అధ్యక్షులు రామాంజినేయులు, నియోజకవర్గ అధ్యక్షులు శంకర్ నాయక్, తెలుగు యువత కోసిగి మండల అధ్యక్షులు నాడిగేని మహదేవ్, మంత్రాలయం మండల అధ్యక్షులు మాధవరం సాయికుమార్, కౌతాళం మండల అధ్యక్షులు దొడ్డన్న గౌడ్, ఐ టిడిపి నియోజకవర్గ అధ్యక్షులు సల్మాన్ రాజు, వక్రాని కృష్ణ, భూంపల్లి నీలకంఠ, రామచంద్ర నాయుడు, లక్ష్మారి చిదానంద, దుద్ది నాగేష్, బసలదొడ్డి కృష్ణ, పెద్దభూంపల్లి హనుమంతు, రామకృష్ణ, చిలకలడోణ బసవరాజు, శివకుమార్, బెళగల్ నాగరాజు, సీతారాముడు, చిన్నతుంబళం శివ, దొడ్డి రామాంజినేయులు, రంగాపురం చిన్న, చింతకుంట రామయ్య, కంపాడు హనుమన్న, పల్లెపాడు శేఖర్, నరసయ్య, కోసిగి రాజశేఖర్, తిప్పలదొడ్డి శ్రీరాములు, మైబు, వగరూరు లింగప్ప, అగసనూరు అంజినిరెడ్డి, మహదేవ్, దొడ్డి గడ్డం వీరేష్ దీక్షలో కుర్చున్నారు. తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి అడివప్ప గౌడ్, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చెన్నబసప్ప, తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటపతి రాజు, బీసీ సీనియర్ నాయకులు వక్రాని వెంకటేశ్వర్లు, నాడిగేని అయ్యన్న, చిన్నభూంపల్లి మాజీ సర్పంచి నరసింహులు, జంపాపురం మాజీ సర్పంచి కృష్ణా రెడ్డి, పెద్దభూంపల్లి జనార్ధన్, నాడిగేని వీరారెడ్డి, ఎస్సీ సెల్ సీనియర్ నాయకులు మారెప్ప, ఏబు, ఉరుకుందు, సురేంద్ర, బెళగల్ ప్రభాకర్ రెడ్డి, సర్పంచి రామయ్య, గుండేష్, ఉసేని, తెలుగు యువత కర్నూలు జిల్లా మీడియా కోఆర్డినేటర్ విజయ రామిరెడ్డి, పవన్ కూమర్, ఎంపిటిసి వెంకటేశ్వర్లు, వట్టేప్ప గారి నరసింహులు, మేకల నరసింహులు, ఐ టిడిపి మంజునాథ్, దుద్ది ఉసేని, షఫి, దొడ్డి రంగారెడ్డి, శ్యామ్ సందర్ పాల్గొన్నారు.
చంద్రబాబు విజన్ కలిగిన మహా నేత
చంద్రబాబు ఒక విజన్ కలిగిన మహా నేత అని రాఘవేంద్రస్వామి దర్శనార్థమై బెంగళూరు నుంచి మంత్రాలయం వచ్చిన భక్తులు సుధీర్, శారద పేర్కొన్నారు. టిడిపి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షకు మద్దతుగా నిలిచారు.
దీక్షలనుద్దేశించి మాట్లాడుతున్న తిక్కారెడ్డి










