Aug 14,2023 22:47

ప్రజాశక్తి కలక్టరేట్‌ (కృష్ణా) : గత నెల జులైలో కురిసిన భారీ వర్షాలకు కష్ణా జిల్లాలో నష్ట పోయిన రైతులందరిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్ర ప్రదేశ్‌, రైతు,కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్‌ పి.రాజాబాబుని కలసి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆంధ్ర ప్రదేశ్‌ రైతు సంఘం కష్ణా జిల్లా కార్యదర్శి గౌరిశెట్టి నాగేశ్వరరావు,కౌలు రైతు సంఘం కష్ణా జిల్లా కార్యదర్శి పంచకర్ల రంగారావు లు మాట్లాడుతూ గత నెలలో కురిసిన భారీ వర్షాల వల్ల పంటలు నీట మునిగి దెబ్బతిన్న వరి పొలాలకు 80 శాతం సబ్సిడీపై విత్తనాలు మాత్రమే ఇస్తున్నారని ,ఈ సార్వా సీజన్లో ఎక్కువ శాతం రైతులు, కౌలు రైతులు రెండుసార్లు ఎద రూపంలో, నాట్లు నాట్లు వేసుకున్నామని, మరలా భారీ వర్షాలకు ముంపుకు గురై పంటలు దెబ్బ తిన్నాయన్నారు. ఇప్పటివరకు ఒక ఎకరానికి సుమారు పది నుండి, 12 వేల వరకు ఖర్చు రైతులు ఖర్చు పెట్టుకున్నారని కావున ప్రభుత్వం ఎన్యుమిరెషన్‌ చేసి విత్తనాలతో పాటు,ఆ ఖర్చులను కూడా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు . అలాగే 2022 సార్వా సీజన్‌ తాలూకు రవాణా ఖర్చులు ఇప్పటివరకు ఇవ్వలేదని.హమాలీ ఖర్చులు మాత్రం ఇచ్చారన్నారు .సంబంధిత రవాణా ఖర్చులు రైతుల ఖాతాలలో జమ చేయాలని కోరారు. అలాగే గతంలో 2020 ఏప్రిల్‌లో కురిసిన భారీ వర్షాలు, వడగండ్ల వానకు బంటుమిల్లి, కత్తివెన్ను మండలాలలో దాదాపు4,524 మంది రైతులకు సుమారు మూడు కోట్ల రూపాయలు నష్టపరిహారం ప్రభుత్వం ప్రకటించిందని, కానీ ఈరోజు వరకు రైతులకు ఇవ్వలేదన్నారు. అధికారులు ఆ మొత్తం సి ఎఫ్‌ ఎం ఎస్‌ లొ ఉందని గత రెండు సంవత్సరాల నుండి చెబుతున్నరన్నారు. అనేక సార్లు అధికారులకు విజ్ఞప్తి చేసిన రైతులకు న్యాయం జరగడం లేదన్నారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో ఆవుల బసవయ్య, ఈడే రామారావు లు ఉన్నారు.