ప్రజాశక్తి - పోలవరం
మండలంలోని పోలవరం రెవెన్యూ గ్రామంలో శనివారం ఇ-క్రాప్ నమోదైన వరి, మినుము పంటలను సామాజిక తనిఖీ(సూపర్ చెక్కు) కొరకు జిల్లా వ్యవసాయ అధికారి వై.రామకృష్ణ క్షేత్రస్థాయి పరిశీలన చేసి, రైతుల వివరాలను తెలుసుకున్నారు. ఈ తనిఖీలో భాగంగా ఇ-క్రాప్ నమోదు సాగు చేస్తున్న రైతులు, వారి పేరు మీద ఇ-క్రాపు నమోదు అయినదా లేదా, జలధారం యొక్క వివరాలు, విస్తీర్ణం ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు వంటి వివరాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కె.రాంబాబు, గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు కిలపర్తి రమణబాబు, పైలా సుబ్బారావు, తదితర రైతులు పాల్గొన్నారు.










