వన్‌ప్లస్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వన్‌ప్లస్‌ను ఒప్పోలో విలీనం చేయనున్నట్లు ప్రకటించింది. ఈ విషయంపై వన్‌ప్లస్ సహ వ్యవస్థాపకుడు అండ్ సీఈఒ పీట్ లావ్ మాట్లాడుతూ.. వన్‌ప్లస్ మరింత మందికి చేరువ కావాలనే ప్రయత్నాల్లో భాగంగానే ఒప్పోలో విలీనం చేయనున్నట్లు ఆయన అన్నారు. విలీనం తర్వాత కూడా.. వన్‌ప్లస్, ఒప్పోలు రెండూ కూడా.. ప్రత్యేక బ్రాండ్లుగా.. స్వతంత్రంగానే పనిచేయస్తాయని ఆయన స్పష్టం చేశారు.
వన్‌ప్లస్‌ను పీట్ లావ్, కార్ల్ పెరు కలిసి స్థాపించారు. వీరిద్దరూ డిసెంబర్ 2013లో కంపెనీ స్థాపించడానికి ముందు ఒప్పోలో పనిచేశారు. తాజాగా నిర్ణయం వల్ల భవిష్యత్తులో మరిన్ని మంచి ఉత్పత్తులను తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు రెండు సంస్థలు వెల్లడించాయి. ఇక వన్‌ప్లస్, ఒప్పో రెండూ కూడా చైనాకు చెందిన బీబీకే ఎలక్ట్రానిక్స్ యాజమాన్యం కిందే ఉన్నాయి. వీటితోపాటు వివో, రియల్మీ వంటి బ్రాండ్లు కూడా బైనాకు చెందినవే.










