ఇంటర్నెట్ డెస్కు : ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ తన కొత్త టీవీని సోమవారం (మే 24)న మనదేశంలో లాంచ్ చేయనున్నట్లు ట్విటర్ ద్వారా ప్రకటించింది. వన్ ప్లస్ టీవీ 40 వై1 పేరుతో ఈ టీవీ లాంచ్ కానుంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో 32 వై1, 43 వై1 ఉన్నాయి. తాజాగా అందుబాటులోకి వచ్చే టీవీ 40వై1. దీని ధర కూడా పాతికవేల లోపు ఉండే అవకాశం ఉంది. మార్కెట్లో ఈ కంపెనీ బ్రాండ్‌తో వున్న 31 వై1 టీవీ ధర 15,999గానూ, 43వై1 ధర రూ. 26.999గానూ ఉంది.
టీవీ 40వై1 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఈ టీవీ స్పెసిఫికేషన్లను కంపెనీ ఎప్పట్నుంచో టీజ్ చేస్తుంది. ప్రాసెసర్ పేరును కంపెనీ తెలపలేదు. దీన్ని బట్టి ఈ టీవీ 64 బిట్ ప్రాసెసర్‌పై పనిచేసే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 9 ఆధారిత ఆక్సిజన్ ప్లే ఆపరేటింగ్ సిస్టంను అందించనున్నారు. 40 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఇందులో ఉండనుంది. అలాగే ఈ టీవీ అంచులు సన్నగా ఉండనున్నాయి. ఇక క్రోమ్‌కాస్ట్, అలెక్సా, గూగుల్ అసిస్టెంట్, గూగుల్ ప్లేస్టోర్ యాక్సెస్ కూడా ఉండనుంది. ఇక లేటెస్ట్ వెబ్ సిరీస్ కోసం.. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ యాప్స్‌ను ఇందులో ప్రీలోడెడ్‌గా అందించనున్నారు. ఇంకో ముఖ్యమైన విషయమేమింటంటే.. లేటెస్ట్ టీవీ షోలకు సంబంధించి.. రిమైండర్ ఎపిసోడ్స్ అందించడం కోసం ఇంటిగ్రేటెడ్ కంటెంట్ క్యాలెండర్ అనే ఫీచర్ కూడా ఇందులో ఉండనుంది. ఇక వైఫై, బ్లూటూత్ వీ5 వంటి కనెక్టివిటి ఆప్షన్లు కూడా ఉన్నాయి. 20 డబ్ల్యు స్పీకర్లు, డాల్బీ అట్మాస్ సపోర్టు కూడా ఉంది. అంటే మొత్తం 40 డబ్య్లు సౌండ్ అవుట్‌పుట్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఎథర్నెట్ పోర్టు, ఆర్ఎఫ్ కనెక్షన్ ఇన్పుట్, రెండు హెచ్డీఎంఐ పోర్టులు, ఒక ఏవీ ఇన్, ఒక డిజిటల్ ఆడియో అవుట్‌పుట్, రెండు యూఎస్బీ పోర్టులు కూడా ఇందులో ఉండనున్నాయి.










