Apr 08,2023 22:48

koduru lo janasena nirasana

వంతెన నిర్మించాలని జనసేన ఆందోళన
ప్రజాశక్తి కోడూరు
తక్షణమే సాలెంపాలెం- వేణుగోపాలపురం వంతెను నిర్మించాలని కోడూరు మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అవనిగడ్డ నియోజకవర్గంలో అభివద్ధి అనేది ఎక్కడ కూడా కనబడదని ఆ పార్టీ నేతలు తెలిపారు. శనివారం మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో సాలెంపాలెం వేణుగోపాలపురం వంతెను నిర్మించాలని కోరుతూ భారీ ర్యాలీతో ఆ వంతెన వద్దకు వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు మాట్లాడుతూ 25 సంవత్సరాల నుండి కూడా ఈ వంతెన మీద ప్రయాణాలు చేస్తున్నామని , వంతెన పడిపోయి నెలరోజులు దాటుతున్నప్పటికీ ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరంగా ఉందని విమర్శించారు. జనసేన పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ సీనియర్‌ నాయకులు బచ్చు వెంకటనాథ్‌, జిల్లా లీగల్‌ సెల్‌ ప్రధాన కార్యదర్శి బాసు నాంచారయ్య నాయుడు, మండల పార్టీ అధ్యక్షులు అధ్యక్షులు మర్రే గంగయ్య మాట్లాడుతూ వంతెన మీదుగా గత 25 సంవత్సరాలు నుండి సాలెం పాలెం, వేణుగోపాలపురం, నరసింహపురం ప్రజలు ప్రయాణం చేస్తున్నారన్నారు. కోడూరుకి రావాలంటే ఈ వంతెన మీదగా మూడు కిలోమీటర్ల దూరం తగ్గుతుందన్నారు. జనసేన పార్టీ రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ కార్యదర్శి లంకె యుగంధర్‌ రావు, పిట్టలంక గ్రామ సర్పంచ్‌ కనగాల వెంకటేశ్వరరావు, మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తోట సోమశేఖర రావు, జరుగు ఆదినారాయణ, మండల పార్టీ ప్రధాన కార్యదర్శులు యర్రం శెట్టి దామోదర్‌ రావు, పూషడప్ప శ్రీనివాసరావు ,బాసు శివప్రసాద్‌, పార్టీ కార్యదర్శులు బడే రాజశేఖర్‌, ఆలమూడి సురేష్‌ ,సంయుక్త కార్యదర్శి మేక వీరబాబు, పార్టీ నేతల కోట రాంబాబు, బాదర్ల లోలాక్షుడు, మేడ పిచ్చయ్య, సిద్దినేని అశోక్‌ నాయుడు, కోట సురేంద్ర ,రేపల్లె రామ్మోహన్రావు, తోట రాజేష్‌ ,పూషడప్ప భానుమూర్తి, పేర్ని రవితేజ, బడే మనోజ్‌ కుమార్‌, అప్పికట్ల అంకబాబు, అప్పి కట్ల మణికంఠ , యలవర్తి గోపి, బాదర్ల మల్లి, బచ్చు వీరబాబు, బండే గోపాలకష్ణ, చందు రామాంజనేయులు, కోట గోపాలకష్ణ, కుమార్‌, గుండు రతన్‌ బాబు పాల్గొన్నారు.