ఉపాధి పనులు ప్రారంభిస్తున్న సర్పంచి అరుణ్ కుమార్
ప్రజాశక్తి - దేవనకొండ
గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి పనులను సద్వినియోగం చేసుకొని వలసలు వెళ్లరాదని సర్పంచి అరుణ్ కుమార్ తెలిపారు. సోమవారం మండలంలోని తెర్నేకల్ గ్రామంలో ఉపాధి పనులకు పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామంలోనే పనులు ఉండగా అనవసరంగా దూర ప్రాంతాలకు వలసలు వెళ్లకుండా ఉన్న చోటే పనులు చేసుకోవాలని కోరారు. కూలీలకు కూడా దినసరి వేతనం రూ.257 నుంచి 300 వరకు వస్తుందన్నారు. ఎంపిటిసి నామాల శ్రీను, వార్డు సభ్యులు చాకలి బడేసాబ్, వైసిపి నాయుకులు బెన్నే వెంకటరాముడు, కురువ మల్లేష్, ముంత ఏసేపు, చాకలి తిమ్మప్ప, సిపిఎం నాయకులు కట్ల పరమేష్, మహబూబ్ బాష, గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ మధు పాల్గొన్నారు.










