ప్రజాశక్తి కదిరి టౌన్ : కదిరి పట్టణం కుటా గుళ్ల ఈద్గాV్‌ా, ఖబరిస్తాన్, దర్గాలకు చెందిన భూముల ఆక్రమణకు గురి కావడంతో ఆ భూములను అధికారులు బుధవారం పరిశీలించారు. కదిరి ముస్లిం జెఎసి, కదిరి ముతవల్లిల కమిటి, దర్గాV్‌ా పీఠాధిపతి, ఆర్‌సిపి జిల్లా కమిటీ, వైసిపి పట్టణ అధ్యక్షుడు, వెల్డింగ్ వర్కర్స్ యూనియన్, రాయలసీమ ఇమామ్, మౌజన్ కమిటీ తదితరులు వక్ఫ్ ఆస్తులపై జిల్లా కలెక్టర్‌కు, రాష్ట్ర వక్ఫ్ బోర్డు సిఇఒకు, మైనారిటీ సంక్షేమ శాఖ రాష్ట్ర అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా వక్ఫ్ బోర్డు అధికారులు విచారణ నిర్వహించారు. ఈకార్యక్రమంలో ముతువల్లిల డివిజన్ కమిటీ అధ్యక్షుడు, ముస్లిం జెఎసి కన్వీనర్ టిఎండి ఇలియాజ్,దర్గాV్‌ా పీఠాధిపతి సయ్యద్ ఉబెదుల్లా హుసేని ,రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ సత్యసాయి జిల్లా కార్యదర్శి నాగన్న, వైసిపి పట్టణ అధ్యక్షుడు బాహుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.










