Aug 12,2023 21:21

బాలిక మృతదేహం వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులు

వజ్రాల అన్వేషణలో అపశృతి
- ప్రమాదవశాత్తు వాగులో పడి బాలిక మృతి
- నల్లమల అటవీ ప్రాంతానికి వందల సంఖ్యలో ప్రజలు
ప్రజాశక్తి - మహానంది

     మహానంది మండలం గాజులపల్లె గ్రామ సమీపంలోని నంద్యాల-గిద్దలూరు జాతీయ రహదారి నల్లమల్ల అడవిలో గల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిసర ప్రాంతంలో వజ్రాల అన్వేషణలో అపశృతి చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు బాలిక కాలు జారి వాగులో పడి మృతి చెందింది. వివరాలు.. గత కొన్ని రోజులుగా వర్షాలు కురవడంతో మహానంది మండలంలోని నల్లమల అడవిలోని వాగుల్లో నీరు చేరింది. ఈ వాగుల వెంట వజ్రాలు దొరుకుతాయని ప్రజల నమ్మకం. దీంతో ప్రకాశం, కర్నూలు, అనంతపురం, కడప, విజయవాడ జిల్లాల నుంచి ప్రజలు శనివారం అధిక సంఖ్యలో తరలివచ్చి వజ్రాలను అన్వేషణలో నిమగమయ్యారు. ఏదో ఒక వజ్రం దొరుకుతుందని, లక్షాధికారులు కావొచ్చనే ఉద్దేశంతో ఇక్కడికి ప్రజలు తరలివస్తుంటారు. ఈ సందర్భంలోనే గోస్పాడు మండలం యాలూరు గ్రామానికి చెందిన ఉసేని కుమార్తె కీర్తన (13) శ్రీ సర్వ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం సమీపంలోని వాగు వద్ద వజ్రాలు వెతికేందుకు శుక్రవారం వచ్చింది. వెతుకులాటలో సాయంత్రం ప్రమాదవశాత్తు కాలుజారి వాగులో పడింది. వాగులో ఉన్న రాళ్ల మొఖానికి బలంగా కొట్టుకోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. శనివారం పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

 

వజ్రాల వేటలో నిమగమైన ప్రజలు
వజ్రాల వేటలో నిమగమైన ప్రజలు