ప్రజాశక్తి-కనిగిరి: నవంబర్ 7న హైదరాబాదులో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ నిర్వహించనున్న మాదిగల విశ్వరూప మహా పాదయాత్ర, మహాసభను జయప్రదం చేయాలని నియోజకవర్గ సర్పంచుల సంఘం అధ్యక్షుడు తాతపూడి సురేష్‌బాబు, ఎమ్మార్పీఎస్ నాయకులు జెపి రాజు కోరారు. మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ కనిగిరి మండలం చినఇర్లపాడు, వాగుపల్లి, శంకవరం గ్రామాల్లో గురువారం ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్లమెంట్ శీతాకాలపు చివరి సమావేశంలో ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్‌తో అలంపూర్ నుంచి హైదరాబాదు వరకు మందకృష్ణ మాదిగ పాదయాత్ర నిర్వహించి మహాసభలో పాల్గొంటారని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని మాదిగలు, ఉపకులాల వారు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ప్రచార కార్యక్రమంలో నేలపాటి రవి, గోచిపాతల చిన్న బాబు, సుధీర్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.










