విస్తారంగా మొక్కజొన్న సాగు
తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి
వరికి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న
ప్రజాశక్తి - బనగానపల్లె
మొక్కజొన్న పంటపై రైతులు మక్కువ చూపుతున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు వస్తుండడంతో మొక్కజొన్న పంటను సాగు చేసేందుకు రైతులు మక్కువ చూపుతున్నారు. వరి పంటకు ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న పంటను రైతులు సాగు చేస్తున్నారో బనగానపల్లె మండలంలో 3500 ఎకరాలలో మొక్కజొన్న పంటను రైతులు సాగు చేసినట్లు మండల వ్యవసాయ అధికారి సుబ్బారెడ్డి తెలిపారు. మొక్కజొన్న పంట రైతులకు లాభదాయకంగా ఉంది. ఎకరానికి 30 నుండి 35 క్వింటాల దిగుబడి వస్తున్నడం, తక్కువ పెట్టుబడి కావడంతో రైతులు అధిక విస్తీర్ణంలో మొక్కజొన్న పంటను సాగు చేస్తున్నారు. ఇతర పంటలు గిట్టుబాటు లేకపోవడం మొక్కజొన్న పంట గిట్టుబాటు అవుతుండంతో రైతులు అధికంగా మొక్కజొన్న సాగుకు మొగ్గు చూపుతున్నారు. నీరు తక్కువగా ఉన్న ప్రాంతాలలో ఓరి గిట్టుబాటు గాని రైతులు మొక్కజొన్న పంటను సాగు చేస్తున్నారు ఎకరానికి 35 వేల నుండి 40000 ఆదాయం వస్తుండడంతో రైతులు మొక్కజొన్న పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు.










