ప్రజాశక్తి - మంత్రాలయం
ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో జరుగుతున్న సప్త రాత్రోత్సవాల్లో భాగంగా రాఘవేంద్రస్వామి మూల బృందావనం విశేష పుష్పాలంకరణతో భక్తులకు కనువిందు చేసింది. బుధవారం శ్రీమఠంలో రాఘవేంద్రుని నిజ బృందావనాన్ని పూజారులు నిర్మాల్యం చేసి, బృందావనానికి పంచామృతాభిషేకం, అభిషేకం, తులసి అర్చన వంటి పూజలతో మంగళ హారతులు ఇచ్చారు. అనంతరం బృందావనాన్ని స్వర్ణకవచాలతో, పట్టువస్త్రాలతో, వివిధ పుష్ప హారాలతో అలంకరిచారు. పీఠాధిపతులు శ్రీసుభుదేంధ్రతీర్థులు రాఘవేంద్రుని ఆరాధ్య దైవమైన మూల రాములకు విశిష్ట పూజలు నిర్వహించారు. రాఘవేంద్రుని బృందావనాన్ని దర్శించుకున్నారు. ఆరాధన మహోత్సవాల సందర్భంగా శ్రీమఠం ముఖద్వారం పక్కన ఉన్న యోగీంద్ర సభామండపంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా అలరించాయి. ఉత్సవ మూర్తి ప్రహ్లాదరాయులును కొయ్య, రజత, గజ వాహనం, స్వర్ణ, నవరత్న, స్వర్ణ రథోత్సవాలపై ఉంచి పీఠాధిపతులు శ్రీసుభుదేంధ్రతీర్థులు మంగళ హారతులు ఇచ్చారు. మేళ తాళాలు, మంగళ వాయిధ్యాల నడుమ శ్రీమఠం ప్రాకారంలో వైభవంగా రథోత్సవాలను ఊరేగించారు. అనంతరం ఉత్సవ మూర్తిని ఊయల మండపం వరకు పల్లకిలో తెచ్చి ఊయల సేవ నిర్వహించారు.
పూజలు నిర్వహిస్తున్న పీఠాధిపతులు










