ధర్మవరం టౌన్ : విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణను ఆపాలన్న డిమాండ్‌తో సిపిఎం, సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక కళాజ్యోతి సర్కిల్లో డాక్టర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట బుధవారం నిరసన చేపట్టారు. సిపిఎం నాయకులు పోలా రామాంజినేయులు, జంగాలపల్లి పెద్దన్న, ఎస్‌హెచ్.బాషా, అయూబ్ ఖాన్, ఎల్.ఆదినారాయణ తదితరుల ఆధ్వర్యంలో సిపిఎం కార్యాలయం నుంచి కళాజ్యోతి సర్క్‌ిం మీదుగా అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్యాంకులు, ఎయిర్‌ఫోర్సు, నౌకలు, రైల్వే, బిఎస్‌ఎన్‌ఎల్ తదితర వాటిని ప్రయివేటీకరణ చేశారన్నారు. విశాఖ ఉక్కు ప్రయివేటీ కరణపై రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైన అధికారచ ప్రతిపక్షపార్టీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు నామాలనాగార్జున, నాయకులు రఫీ, వెంకటస్వామి, హరి, రామాంజి తదితరులు పాల్గొన్నారు.
ఓబుల దేవర చెరువు : విశాఖఉక్కు ప్రయివేటీకరణ ఆపాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం సిపిఐ అధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈసందర్బంగా సిపిఐ పుట్టపర్తి నియోజకవర్గ కార్యదర్శి ఆంజనేయులు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఉద్యమం చేస్తుంటే పోలీసుల చేత ఆరెస్టు చేయించడం దుర్మార్గమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి చలపతి, కార్యదర్శులు గంగులప్ప, రమణ, అంజినప్ప, నారాయణ, నరసింహనాయక్, కళావతి, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.
పుట్టపర్తి అర్బన్ : విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ పోరాడి సాధించుకోన్న పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం ప్రవేటికరణ చేయాలని చూస్తోందని ఆ ప్రతిపాదనను విరమించుకోవాలని సిపిఐ, ఎఐటియుసి నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక గణేష్ సర్కిల్‌లో రాస్తారోకో చేపట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గం కార్యదర్శి ఆంజనేయులు మాట్లాడుతూ ప్రధాని మోడీ కార్పొరేట్ శక్తులకు దేశాన్ని అప్పగించేందుకు పూనుకొన్నాడని విమర్శించారు. 20వేల మంది కార్మికుల కడుపు కొట్టడానికి బడా బాబులకు కట్టబెట్టడానికి పూనుకోన్నాడన్నారు. పోరాటాలు చేసి సాధించుకోన్న పరిశ్రమను అప్పనంగా అప్పగించే ప్రతిపాదనను విరమించుకోవాలని లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి నాయకులు గౌస్ లాజాం, వెంకటరమణ, మహిళా సంఘం నాయకురాళ్లు జయలక్ష్మి, ఈశ్వరమ్మ, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.










