ధర్మవరం టౌన్ : రక్త, నేత్రదానాలతో పాటు మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడతామని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ధర్మవరం ఉపశాఖ నూతన కార్యవర్గచైర్మన్ డాక్టర్ నరసింహులు తెలిపారు. స్థానిక సాంస్కృతిక మండలిలో సత్యసాయి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ పోలా ప్రభాకర్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా 15 మంది కొతసభ్యులు నరేంద్రరెడ్డి, సత్యనిర్ధారణ్ ఆధ్వర్యంలో సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ పోలా ప్రభాకర్ మాట్లాడుతూ రక్త, నేత్రదానాలతోపాటు మొక్కలు నాటే కార్యక్రమాలను చేపడుతామని చెప్పారు. రెడ్ క్రాస్ సభ్యత్వాలు మరింత పెరిగే విధంగా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అనంతరం నూతన కమిటిని ఎంపికచేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ధర్మవరం ఉపశాఖ చైర్మన్‌గా నరసింహులు, వైస్ చైర్మన్‌గా నరేంద్రరెడ్డి, ప్రధానకార్యదర్శిగా బోనాలశివయ్య, సహాయకార్యదర్శిగా మనోహర్ గుప్త, కోశాధికారిగా సత్య నిర్ధారణ, బ్లడ్ డొనేషన్‌అండ్ గ్రూపింగ్ చైర్మన్‌గా శ్రీరాములు, మొక్కల పెంపకం విభాగం చైర్మన్‌గా బత్తలపల్లి జయసింహ, కాలుష్యనివారణ పరిరక్షణ విభాగం చైర్మన్‌గా సుదర్శన్ గుప్తా, వృద్ధులు సామాజిక ఆరోగ్య ప్రణాళిక విభాగం ఛైర్మన్‌గా సత్యనిర్ధారణ, సామాజిక వైద్యశిబిరాల విభాగం చైర్మన్ సత్రశాల ప్రసన్నకుమార్లను ఎంపిక చేశారు.










