విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొంటాం
- ఎపి రాష్ట్ర విపత్తుల స్పందన, అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ పివి సునీల్ కుమార్
- ఫైర్ స్టేషన్ ప్రారగణంలో ఫిల్లింగ్ స్టేషన్ ఫెడరేల్ పంపు ప్రారంభం
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
రాబోయో రోజుల్లో ఎక్కడైన విపత్తు సంభవించిన వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు విపత్తుల స్పందన, అగ్నిమాపక శాఖ సిద్ధంగా ఉంటుందని ఎపి రాష్ట్ర విపత్తుల స్పందన, అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ పివి సునీల్ కుమార్ తెలిపారు. శుక్రవారం నంద్యాలలోని ఫైర్ స్టేషన్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ఫిల్లింగ్ స్టేషన్ ఫెడరెల్ పంపును జిల్లా ఎస్పీ కె.రఘు వీర్ రెడ్డి, అగ్నిమాపక శాఖ రీజినల్ అధికారి కె.భూపాల్ రెడ్డి, జిల్లా అధికారి జయన్న తదితరులతో కలిసి పివి సునీల్ కుమార్ ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నంద్యాల ఫైర్ స్టేషన్ ప్రాంగణంలో ఫిల్లింగ్ స్టేషన్ ఫెడరేల్ పంపు ద్వారా వచ్చే ఆదాయాన్ని సిబ్బంది సంక్షేమనికి వినియోగిస్తామన్నారు. ప్రతినెలా కొన్ని నిధులు సమాకుర్చుకుంటామని తెలిపారు. ఫైర్ సిబ్బంది అనేక రిస్క్యు ఆపరేషన్‌లు చేపడుతుంటారని, ఎక్కడైనా విపత్తు వచ్చిందంటే మొదటగా ఉండేది ఫైర్, పోలీస్ డిపార్ట్మెంట్‌లేనన్నారు. కేవలం అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడే కాకుండా ఏదైనా వరదలు, రైలు ప్రమాదాలు జరిగినప్పుడు స్పందించేది ఏపి విపత్తు స్పందన శాఖ, అగ్నిమాపక శాఖలు స్పందిస్తున్నాయన్నారు. రిస్క్యు ఆపరేషన్‌లను ఈ శాఖ సమర్థవంతంగా చేస్తుందన్నారు. 15 ఫైనాన్స్ కింద పిఎం రాష్ట్రానికి రూ. 253 కోట్లు కేటాయించారన్నారు. ఆ నిధులను అగ్నిమాపక శాఖ ఆధునీకీకరణ కోసం వినియోగిస్తామని తెలిపారు. రాబోయో రోజుల్లో అగ్ని మాపక శాఖను బలోపేతం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










