Sep 30,2023 21:28

  ఏలూరు టౌన్‌:జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాథ్‌ ఆధ్వర్యంలో 'స్వచ్ఛత హీ సేవ' కార్యక్రమం వినూత్నంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 400 మంది సిబ్బంది, పంచాయతీ రాజ్‌ శాఖ, గ్రామ సచివాలయం సిబ్బంది, పెదపాడు, ది పెదపాడు విశాల సహకార పరపతి సంఘం ప్రాంగణంలో 'స్వచ్ఛత హీ సేవ' అక్షరమాలలో నిలబడి ఐక్యత చాటారు.