Sep 25,2023 21:09

అర్జీలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ నిశాంత్‌

ప్రజాశక్తి-పార్వతీపురం : జగనన్నకి చెబుదాం కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చిన వినతులను సత్వరమే పూర్తిస్థాయిలో పరిష్కరించాలని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహంచిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడారు. వచ్చిన వినతులను ప్రతిష్టాత్మకంగా తీసుకొని శాఖల వారిగా సత్వరమే పరిష్కరించి, అర్జీదారుల సంతృప్తిస్తాయి పెంచాలని సూచించారు. కార్యక్రమంలో ఐటిడిఎ పిఒ సి.విష్ణుచరణ్‌, జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావుతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో 187 దరఖాస్తులు అందగా, అధికంగా భూసమస్యలు పరిష్కరించాలని అర్జీలు అందజేశారు. వినతుల్లో కొన్ని....
శ్రీ సాలూరు మండలం దళాయివలస గ్రామం నుండి మువ్వల కామయ్య, మువ్వల అప్పారావు, మువ్వల బంగురు రైతులు వ్యవసాయం బోర్లు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. శ్రీ పాలకొండ మండలం పణుకువలసకు చెందిన వారణాసి మల్లికొండ, తదితరులు సర్వే నంబరు 2-13లో 1.30 ఎకరాలను సాగుచేస్తున్నామని, తమ భూమికి ఆక్రమణదారుల నుండి రక్షణ కల్పించాలని కోరారు. శ్రీ మక్కువ మండలం శంబరకు చెందిన జోడ తిరుపతి పింఛను మంజూరు చేయాలని విన్నవించారు. శ్రీ సాలూరు మండలం మావుడి గ్రామస్తులు 3 నెలలు నుండి వర్షాకాలం ప్రభావం వల్ల రోడ్డు అస్తవ్యస్తంగా తయారైందని, వెంటనే మరమ్మతులు చేయాలని అర్జీ అందచేశారు.
కార్యక్రమంలో డిఆర్‌డిఎ పీడీ పి.కిరణ్‌ కుమార్‌, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, డిఎంహెచ్‌ఒ బి.జగన్నాథరావు, జిల్లా ఆర్‌.డబ్ల్యు.ఎస్‌ ఇంజినీరింగ్‌ అధికారి ఒ.ప్రభాకరరావు, డిపిఒ బి.సత్యనారాయణ, డిఇఒ ఎన్‌.ప్రేమ్‌ కుమార్‌, సివిల్‌ సప్లై డిఎం నాయక్‌, జిల్లా వ్యవసాయ అధికారి రాబర్ట్‌ పాల్‌, జిల్లా ఉద్యానఅధికారి కె.వి.ఎస్‌.ఎన్‌ రెడ్డి, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కె. విజయ గౌరి, తదితరులు పాల్గొన్నారు.
ఐటిడిఎ స్పందన వినతుల వెల్లువ

సీతంపేట : ఐటిడిఎలో పిఒ కల్పనకుమారి ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నడసంద్ర గ్రామానికి చెందిన మోహిని పాత్ర ఎఎన్‌ఎం పోస్టు ఇప్పించాలని వినతి అందించారు. లంగడుగూడకు చెందిన సవర కూర్మారావు కుట్టుమిషన్‌ ఇప్పించాలని కోరారు. జక్కరవీధికి చెందిన ధర్మరాజు తాగునీటి సమస్య పరిష్కరిం చాలని విన్నవించారు. ముకుందపురానికి చెందిన రమేష్‌ సాగు పట్టా ఇప్పించాలని విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో ఎపిఒ రోషిరెడ్డి, డిడి మంగవేణి, డిప్యూటీ డిఇఒ లిల్లీరాణి, డిప్యూటీ డిఎంహెచ్‌ఒ విజయపార్వతి, ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఇఇ సింహాచలం, స్పోర్ట్స్‌ ఇన్‌ఛార్జి జాకబ్‌ దయానంద్‌, సిడిపిఒ రంగలక్ష్మి, పిహెచ్‌ఒ గణేష్‌, పిఎఒ హరికృష్ణ పాల్గొన్నారు.