Oct 30,2023 19:02

వికలాంగులకు భోజనాలు పెడుతున్న దృశ్యం

ప్రజాశక్తి-కందుకూరు :శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్‌ సొసైటీ కందుకూరు వారి అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా సోమవారం గుంటూరు వాస్తవ్యులైన కీ.శే. బందా వెంకట సత్య సుందర శేషు జయంతి సందర్భంగా వారి భార్య లక్ష్మీ చౌడేశ్వరి, కుమార్తెలు, అల్లుళ్ళు, కుటుంబ సభ్యుల సహకారంతో కందుకూరు స్వర్ణ స్వయంకషి మానసిక వికలాంగుల ఆశ్రమంలో పిల్లలకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్‌ సొసైటీ అధ్యక్షులు రవ్వా శ్రీనివాసులు సభ్యులు చీదెళ్ళ కృష్ణ పాల్గొన్నారు.