Aug 03,2023 19:55

అష్టోత్తర పారాయణం చేస్తున్న పీఠాధిపతులు

ప్రజాశక్తి - మంత్రాలయం
అధిక శ్రావణ మాసం సందర్భంగా శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో పీఠాధిపతులు శ్రీసుభుదేంధ్రతీర్థుల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన రాఘవేంద్రుని సామూహిక అష్టోత్తర పారాయణం భక్తులకు వీనులవిందు కలిగించింది. ప్రతేడాది ఆగస్టులో నిర్వహించే రాఘవేంద్రస్వామి సప్త రాత్రోత్సవాలు అధిక శ్రావణ మాసం రావడంతో సెప్టెంబర్‌ 1న మధ్యారాధన జరుగుతుంది. సామూహిక అష్టోత్తర పారాయణం చేసేందుకు వచ్చిన భక్తులు కాషాయ వస్త్రాలు ధరించి రావడంతో శ్రీమఠం ప్రాకారం కాషాయమయమైంది. రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి పీఠాధిపతులు శ్రీసుభుదేంధ్రతీర్థులు మహా పంచామృతాభిషేకం నిర్వహించారు. శ్రీమఠం శిష్యులతో పాటు పండితులు భక్తులు ఏకధాటిగా స్వామి వారి అష్టోత్తర పారాయణం చేశారు. పాల్గొనేందుకు వచ్చిన భక్తులకు ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పించారు. పీఠాధిపతులు శ్రీసుభుదేంధ్రతీర్థులు రాఘవేంద్రస్వామి 352వ ఆరాధన మహోత్సవాల ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు. శ్రీమఠం ఎఎఒ మాధవశెట్టి, మేనేజర్లు ఎస్‌కె.శ్రీనివాసరావు, వెంకటేష జ్యోషి, ఆధ్యాత్మిక అభివృద్ధి అధికారులు శ్రీపతి, వాదిరాజాచార్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ ఐపి.నరసింహమూర్తి, సహాయక పిఆర్‌ఒ హొన్నొళ్లి వ్యాసరాజాచార్‌, సిబ్బంది బిందు, మాధవ స్వామి పాల్గొన్నారు.