Nov 06,2023 23:46

వీధిలైట్లు వేయాలని కోరుతున్న పాముల కాలనీ వాసులు


ప్రజాశక్తి-సిఎస్‌పురం
గత ఆరు నెలలుగా వీధిలైట్లు లేక ఛాలా ఇబ్బందులు పడుతున్నామని సిఎస్‌పురంలోని పాముల కాలనీ వాసులు వాపోయారు కాలనీ చుట్టూ దట్టమైన చిల్ల చెట్లు పెరిగి ఉండటం వల్ల రాత్రి పూట విష సర్పాలు సంచరిస్తున్నాయని కాలనీ వాసులు తెలిపారు ఆరు నెలల క్రితం వీధిలైట్లు బాగుచేయాలని ఉన్న లైట్లను తీసుకెళ్లారని ఇంతవరకు పట్టించుకోలేదని సీపీఎం పార్టీ నాయకులు ఊసా వేంకటేశ్వర్లు ముందు కాలనీ వాసులు వాపోయారు చీకట్లో బిక్కు బిక్కుమంటూ బ్రతుకు తున్నామని ఇప్పటి కైనా పంచాయితీ అధికారులు పాలక మండలి వారు పట్టించుకొని వీధిలైట్లు వేయాలని పాముల కాలనీ వాసులు కోరుతున్నారు.