Oct 25,2023 20:42

వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

ప్రజశక్తి -పెద్దకడబూరు
మండలంలో విద్యుత్‌ సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే ఆందోళనకను ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. బుధవారం పెద్దకడబూరులోని విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ వద్ద ఎపి రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి తిక్కన్న, రైతు సంఘం జిల్లా నాయకులు పరమేష్‌ మాట్లాడారు. వ్యవసాయానికి పగలే 9 గంటల విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. ఎఇ గోవిందుకు వినతిపత్రం అందజేశారు.