Jul 28,2023 21:05

మాట్లాడుతున్న జెఎసి నాయకులు

విద్యుత్‌ కాంటాక్ట్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలి : జెఎసి
ప్రజాశక్తి - బేతంచర్ల

విద్యుత్‌ శాఖలో విధులు నిర్వహిస్తున్న విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్‌ చేయాలని జేఏసీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్‌ కాంటాక్ట్‌ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నాడు బేతంచెర్లలోని డోన్‌ రోడ్డులో గల విద్యుత్‌ సబ్స్టేషన్‌ వద్ద జేఏసీ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాత్రి పగలు తేడా లేకుండా సమాజానికి వెలుగునిచ్చే పనిలో నిమగమై ప్రాణాల సైతం లెక్కపెట్టకుండా విధులు నిర్వహిస్తున్న విద్యుత్‌ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు విన్నవించినా స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. విద్యుత్‌ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి విధి నిర్వహణలో తీవ్రంగా గాయ పడిన లేదా మరణించిన కార్మికుడి కుటుంబానికి రూ.10 లక్షల ఇచ్చి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని వారు కోరారు. ఆగస్టు 8వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఆగస్టు 10న చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్‌ కాంట్రాక్టు ఉద్యోగులు, పర్మినెంట్‌ ఉద్యోగులు సురేష్‌ బాబు, నిరంజన్‌ బాబు, శ్రీనివాసులు ,చంద్రశేఖర్‌, మస్తాన్‌, కాంటాక్ట్‌ కార్మికులు గిరి కుమార్‌ , ఆంజనేయులు, ఎనర్జీ అసిస్టెంట్‌ మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.