ప్రజాశక్తి - నాగులుప్పలపాడు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సర్దుబాటు పేరుతో ప్రజలపై మోపుతున్న విద్యుత్ భారాలు తగ్గించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో మండల పరిధిలోని ఉప్పుగుండూరు విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకుడు జె.జయంతిబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి ఇప్పుడు మాట మార్చి పలు దపాలుగా విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరాచారన్నారు కేంద్రప్రభుత్వం 2020లో తెచ్చిన విద్యుత్ చట్టాన్ని అన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తుండగా మనరాష్ట్రంలో అందుకు భిన్నంగా అమలు చేయడంలో జగన్ ముందంజలో ఉన్నారని విమర్శించారు కేంద్రప్రభుత్వం ఆడించినట్లుగా ముఖ్యమంత్రి జగన్ ట్రూఅప్, పిఎప్ సి పేర్లతో అధిక బిల్లులు వసూలు చేయడం దుర్మార్గమైన చర్య అని తెలిపారు. స్మార్ట్ మీటర్లు బిగింపుతో రైతాంగాన్ని వ్యవసాయానికీ దూరం చేస్తున్నారన్నారు. విద్యుత్ ప్రవేటీకరణను నిలుపుదల చేయాలన్నారు విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం విద్యుత్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి టి.శ్రీకాంత్, జి. బసవపున్నయ్య, యు.వెంకటేశ్వర్లు, కాకాని సుబ్బారావు, ఎన్. రామారావు, జాగర్లమూడి ప్రసాదు, కె.శ్రీను,జూపూడి బాబూరావు, వసంతరావు,గ్రామస్తులు పాల్గొన్నారు.










