ప్రజాశక్తి-టంగుటూరు : విద్యుత్ భారాలను వెంటనే తగ్గించాలని వామపక్ష పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. మండల పరిధిలోని పొందూరు గ్రామంలో విద్యుత్ భారాలపై ప్రజా బ్యాలెట్ ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా 62 మంది ప్రజా బ్యాలెట్‌లో పాల్గొన్నారు. అందులో 60 మంది కరెంటు ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కన్వీనర్ వేశపోగు మోజెస్, ఎంఎల్ పార్టీ నాయకులు పరిటాల కోటేశ్వరరావు, వేజెండ్ల రామారావు, గుళ్ళపల్లి వెంకట్రావు, బెజవాడ శివరామకష్ణ పాల్గొన్నారు.ఒంగోలు : సిపిఎం కొప్పోలు శాఖ ఆధ్వర్యంలో విద్యుత్తు ఛార్జీల పెంపుదలపై ప్రజా బాల్యెట్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఛార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా 98 శాతం మంది ఓటు వేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం శాఖా సభ్యులుబొడపాటి రాఘవరావు, గంగాడి నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పిసిపల్లి : విద్యుత్ ఛార్జీల పెంపుదలపై సిపిఎం ఆధ్వర్యంలో పిసిపల్లి బస్టాండ్ సెంటర్‌లో ఆదివారం ప్రజా బ్యాలెట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం కనిగిరి డివిజన్ నాయకుడు బడుగు వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై రకరకాల ఛార్జీల పేరుతో ప్రజలపై భారాలు మోపి వారిని ఇబ్బందులకు గురిచేస్తుందని విమర్శించారు. అనంతరం పోలైన బ్యాలెట్లను బాల్కో విశ్రాంత ఉద్యోగి గంగిశెట్టి నరసింహం, చత్తీస్‌ఘడ్ రాష్ట్ర ఎలక్ట్రికల్ బోర్డు విశ్రాంత ఉద్యోగి బడుగు మాలకొండయ్య లెక్కించారు. విద్యుత్ ఛార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా 98 శాతం ఓట్లు వచ్చినట్లు తలెఇపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకుడు గుంటగాని యాకోబు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బడుగు జనార్ధన్, బట్టుపల్లి మాజీ సర్పంచి మూలే పుల్లారెడ్డి, ముద్దపాడు మాజీసర్పంచి ఎన్.రత్తయ్య, విశ్రాంత బ్యాంకు ఉద్యోగి రత్నం, విశ్రాంత రైల్వే ఉద్యోగి మాలకొండయ్య,గురుమూర్తి పాల్గొన్నారు.










