వీరఘట్టం: మండల కేంద్రంలోని సాయి నగర్ కాలనీకి చెందిన ఆలుబిల్లి కుమార్ (19) అనే విద్యార్థి విద్యుత్ ఘాతానికి గురై బుధవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కలగొప్పిలో భాగంగా వరి చేనుకు కోబలి జల్లేందుకు వీలుగా టేకు ఆకులు అవసరం ఉండడంతో ఆర్ అండ్ బి బంగ్లాకి సమీపంలో ఉన్న టేకు తోట వద్దకు వెళ్లి టేకు చెట్టు వద్దకు కుమార్ వెళ్లాడు. ఈ చెట్టుకు అనుకొని విద్యుత్ వైర్ ఉండడాన్ని గమనించక పోవడంతో చెట్టు ఎక్కి కొమ్మ కొడుతుండగా కొమ్మ వెళ్లి వైర్ మీద పడడంతో ఆ కొమ్మ విద్యార్థికి తగలడంతో విద్యుత్తు చాకుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో పక్కనే ఉన్న గ్రామస్తులు పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమారమిచ్చారు. కుమారుడి మతి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరై విలపించడంతో పలువురు కంటతడి పెట్టారు. కుమార్ పాలకొండలోనే తమ్మినాయుడు డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కుమార్‌కు తల్లిదండ్రులు సూరీడమ్మ, మజ్జిశ్వరరావు, అన్నయ్య, చెల్లెలు ఉన్నారు. తండ్రి మజ్జిశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం వెంకటరమణ తెలిపారు.










