మృతి చెందిన అప్పారావు
ప్రజాశక్తి - గరుగుబిల్లి : మండలంలోని కోత్తూరు గ్రామ సమీపంలో ద్వారపురెడ్డి రామమో హన్‌రావు పామాయిల తోటలో పనిచేస్తున్న చిట్టిబోయిన అప్పారావు అనే వ్యక్తి ప్రతీ రోజులాగే కరెంట్ మోటారు వేసేందుకు వెళ్లి సోమ వారం విద్యుదాఘాతానికి గురయ్యాడు. మోటారు వేయగా దాని దగ్గర ఉన్న స్టాటర్‌ను ప్రమాదవాసాత్తు పట్టుకున్నాడు. దీంతో షాక్ తగిలి మృతి చెందినట్లు ఎస్.ఐ ఎం. రాజేష్ తెలిపారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.










