Sep 15,2023 21:23

  చింతలపూడి: విద్యుత్‌ వైర్లు తగిలి గేదె మృతి చెందిన సంఘటన మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ముక్కంపాడు గ్రామానికి చెందిన బందెల కృపావరం అనే రైతు గేదె పొలాల్లో మేత మేస్తుండగా కరెంట్‌ వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. ఈ మధ్యకాలంలో కాన్పు జరిగిందని, దాదాపుగా రూ.80 వేలు విలువ చేసే గేదె మృతి చెందటంతో ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఆదుకోవాలని కోరారు.