ప్రజాశక్తి-గుడ్లవల్లేరు : విద్యుత్ షాక్‌తో ఓ విద్యార్థి మతి చెందిన సంఘటన మండలంలోని చింతలగుంట ఎంపీపీ స్కూల్ వద్ద చోటుచేసుకుంది. బంధు వులు తెలిపిన వివరాల ప్రకారం లంకా కార్తీక్ (7) చింతలగుంట ఎంపీపీ స్కూల్లో రెండవ తరగతి చదువుతున్నాడు. గురువారం యధావిధిగా స్కూల్ కి వెళ్ళాడు. స్కూల్ నూతన భవనం నిర్మాణం జరుగుతుండడంతో ప్రక్కన తాటాకు ఇంట్లో స్కూలు నడుపుతున్నారు. ఎదురుగా ఉన్న విద్యుత్ మోటారు పంపు ఉన్నాయి. కార్తీక్ ఆ పంపు వద్దకు వెళ్లి నీళ్లు పట్టుకునేందుకు ప్రయత్నించగా విద్యుత్ ప్రవహించి బాలుడు అక్కడికక్కడే మతి చెందాడు. సంఘటన స్థలానికి ఎంపీడీవో దారపు శ్రీనివాస్, గుడివాడ డివైఈవో, ఎంఈఓ 2 జి గోపాల్ రావు, కార్యదర్శి ఎజేఎల్ నరసింహారావు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పరిశీలించారు. దీనిపై అధికారులు బాలుడికి ప్రభుత్వం నుండి రావలసిన సహాయాన్ని అందేవిధంగా ప్రయత్నిస్తానని తెలిపారు. ఉపాధ్యాయుని నిర్లక్ష్యం వల్ల ఈ సంఘటన జరిగినట్లు బంధువుల ఆరోపిస్తున్నారు.










