ప్రజాశక్తి - పుట్టపర్తి రూరల్ : ఆధునిక సమాజంలో రోజురోజుకు పోటీ తత్వం పెరిగిపోతుందని, ఇందులో రాణించాలంటే యువతకి విద్య తో పాటు, అంకితభావం క్రమ శిక్షణ,బాధ్యతతో కూడిన అనుభవం ఉంటేనే ఏ రంగంలోనైనా విజయం సాధించగలుతారని జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పుట్టపర్తి మండల పరిధిలోని సంస్కృతి ఇంజనీరింగ్ కళాశాల అవరణలో నెహ్రూ యువ కేంద్ర, యువజన వ్యవహారాల మరియు క్రీడా శాఖ భారత ప్రభుత్వం వారు నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవం-2023 కార్యక్రమంలో ఎస్పీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భారతదేశ భవిషత్తు యువత చేతిలోనే ఉందని, ప్రతి ఒక్కరూ వారిలో అంతర్లీనంగా దాగివున్న ప్రతిభను వెలికితీయాలని కోరారు. యువత విద్యతో పాటు ఇతర, సామాజిక కార్యక్రమాలపై అవగహన పెంచుకోవాలని సూచించారు. యుజనోత్సవం-2023 పంచప్రన్ కార్యక్రమంలో భాగంగా కవితలు,పెయింటింగ్, మొబైల్ ఫోటోగ్రఫీ, వకృత్వ, జానపద సాంస్కృతిక విభాగాల్లో జిల్లా స్థాయిలో విజయం సాధించిన వారికి ఎస్పీ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ ప్రెసిడెంట్ రాగే హరిత, సంస్కృతి ఇంజనీరింగ్ కళాశాల డీన్, నెహ్రూ యువజన కేంద్ర ప్రెసిడెంట్ శ్రీనివాసులు, ఇతర సిబ్బంది, వివిధ కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.










