Apr 15,2023 22:39

సమావేశంలో పాల్గొన్న అధికారులు

ధర్మవరం టౌన్‌ : విద్యతోనే ఉత్తమ భవిష్యత్తు లభిస్తుందని మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున, టూ టౌన్‌ సిఐ రాజా, రిటైర్డ్‌ ఎంఇఒ చిన్నపరెడ్డి తెలిపారు. పట్టణంలోని రేగాటిపల్లి రోడ్డు-రిజ్వాన్స్‌ విశ్వ భారతి హై స్కూల్లో శనివారం సాయంత్రం యాన్యువల్‌ డే, చిల్డ్రన్‌ గ్రాడ్యుయేషన్‌ డే ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు మాట్లాడుతూ నేటి కాలంలో సైన్స్‌ టెక్నాలజీ అతి ముఖ్యమైనదని అన్నారు. దీని ద్వారా ఏ సమస్య అయినా విజయవంతంగా పరిష్కరించే అవకాశం ఉందన్నారు. ఇష్టపడి చదివినప్పుడే భవిష్యత్తులో ఒక ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చాన్నారు. అనంతరం నిర్వహించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్‌ షేక్‌ శేకున్‌, వివేకానంద డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ రిజ్వాన్‌ భాషా, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.