ప్రజాశక్తి -భామిని : విద్యకు ప్రాధాన్యత లేని రంగం లేదని, దాంతోనే బంగారు భవిష్యత్తు లభిస్తుందని డిప్యూటీ డిఇఒ విజయకుమారి తెలిపారు. ఎంఇఒ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భామినిలో విద్యా సంకల్ప మేళా కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు భామినిలో ర్యాలీ నిర్వహించారు. విద్య ప్రాధాన్యత, బాలికల విద్య పట్ల నినాదాలు చేస్తూ అవగాహన కలిగించారు. విద్యార్థులకు విద్య ప్రాధాన్యత గురించి వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. మధ్యాహ్నం స్థానిక ఆదర్శ పాఠశాలలో ప్రత్యేక సమావేశం నిర్వహించి, పేద గిరిజన కుటుంబంలో పుట్టిన ఆడపిల్లలను విద్యా వంతులుగా తీర్చిదిద్దిన తల్లితండ్రులను సన్మానించారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ డిడి మంగవేణి, డిప్యూటీ డిఇఒ లిల్లీ రాణి, ఎంఇఒ భాస్కరరావు, ఎంపిడిఒ జి.చంద్రరావు, తహశీల్దార్ నీలపు అప్పారావు, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ రఘుపాత్రుని శివకుమార్, పాల్గొన్నారు.










