Aug 09,2023 23:12

ప్రజాశక్తి-కలక్టరేట్‌ (కృష్ణా) : ఆదివాసీలు నేటికీ అనేకరంగాల్లో వెనకబాటులోనే ఉన్నారని, విద్య ద్వారానే నాగరిక సమాజంలో కలిసి తమ హక్కులను ఉనికిని కాపాడుకోగలుగుతారని కష్ణాజిల్లా రెవిన్యూ అధికారి ఎం. వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. బుధవారం జిల్లా పరిషత్‌ సమావేశపు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గిరిజనులు తమ హక్కులపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలని సూచించారు. మన ప్రాచీన సంస్కతీ, సంప్రదాయాల పరిరక్షణలో ఆదివాసీల పాత్ర, కషి ఫలితం ఎంతో ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ ద్వారా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి. ఆదివాసీల ఆర్థికాభివద్ధికి పెద్దపీట వేసిందన్నారు. కష్ణాజిల్లా గిరిజన సంక్షేమ శాఖ, గిరిజన ఆర్ధిక సంస్థ (ఎస్‌.టి.కార్పొరేషన్‌) ద్వారా 2022-23 సంవత్స రంలో గిరిజనాభివద్ధికి చేపట్టిన కార్యక్రమాల ప్రగతి నివేదికను వివరించారు. జిల్లా గిరిజన సంక్షేమ సాధికారత అధికారి ఫణి దూర్జిటి మాట్లాడుతూ, జిల్లాలో ప్రధానంగా ఉన్నటువంటి ఎరుకుల, లంబాడీ, యానాది వర్గాల వారి అభివద్ధి కోసం అనేక రకాల సంక్షేమ పథకాల ద్వారా లబ్ది చేకూర్చడం జరిగిందన్నారు. తొలుత భారతరత్న డా. బీ. ఆర్‌. అంబేద్కర్‌, అల్లూరి సీతారామరాజు, ఏకలవ్యుడు, చెంచులక్ష్మి , సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌, వెన్నెలకంటే రాఘవయ్య తదితర మహనీయుల చిత్ర పటాలకు పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. మైలవరం గురుకుల పాఠశాల బాలికలు బంజారా నత్యంతో, ఉయ్యూరు గురుకుల పాఠశాల విద్యార్థులు చేసిన నత్య ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. ఉయ్యురు గిరిజన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ కె. కష్ణమోహన్‌, 22 వ డివిజన్‌ కార్పొరేటర్‌ రాష్ట్ర యానాది సంఘం నాయకులు ఏకసిరి వెంకటేశ్వరరావు, మడిచర్ల సర్పంచ్‌ శాంతమ్మ, భూక్య దేవి, నక్కా వినయబాబు, జక్కుల ఆనందబాబు, మౌలాలి తదితరులు పాల్గొన్నారు.