చాట్రాయి:వికలాంగులు నడిపే స్కూటీని ఇప్పించి ఉన్నత విద్యాకు సహకరించాలని మండలంలోని మంకొల్లు గ్రామానికి చెందిన వికలాంగుడైన తనగాల సంతోష్ మంగళవారం తహశీల్దార్ సిహెచ్.విశ్వనాధరావుకు వినతిని సమర్పించారు. పుట్టుకతోనే రెండు కాళ్లు పనిచేయని స్థితిలో వికలాంగత్వం కలిగి ఉన్నానని, ఐనా పట్టుదలతో పదో తరగతి చదివి పాస్ అయ్యానని తెలిపారు. ప్రస్తుతం చింతలపూడి ప్రభుత్వ కళాశాలలో ఇంటర్‌మీడియట్ చదువుతున్నానీ, కాలేజీకి వెళ్లి రావటానికి చాలా ఇబ్బంది పడుతున్నానని తెలిపారు. వికలాంగులు నడిపే స్కూటీని ఇప్పించి ఉన్నత విద్యకు సహకరించాలని, నివాస స్థలానికి ఇళ్ల స్థలము కూడా మంజూరు చేయాలని కోరారు. తల్లిదండ్రులు చిన్నప్పుడే మరణించారని పోషణకు ప్రభుత్వ భూమిని కొంత మంజూరు చేయాలని కోరాడు. ఈ విషయమై నూజివీడు సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా తహశీల్దార్‌కు మీ సమస్యను పరిష్కరించేలా చెబుతానని తెలిపారు.










