Sep 11,2023 22:06

కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి ఉషశ్రీచరణ్‌

         ప్రజాశక్తి-కళ్యాణదుర్గం   విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మంత్రి ఉషశ్రీచరణ్‌ పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక బాలికల వసతి గృహంలో నూతనంగా ఏర్పాటు చేసిన 1000 లీటర్ల శుద్ధ జలప్లాంట్‌ను మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి పౌరులన్న విషయాన్ని గుర్తించి సిఎం జగనన్న విద్యార్థులకు అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారన్నారు. ఇందులో భాగంగా తీసుకొచ్చిన అమ్మఒడి పథకం దేశమంతా మెచ్చుకునే గొప్ప పథకం అన్నారు. అలాగే విద్యాదీవెన పథకం ద్వారా ఎంతోమంది గ్రామీణ విద్యార్థులు పాఠశాలలు, కళాశాలల్లో విద్యను అభ్యసిస్తున్నారన్నారు. ఈకార్యక్రమంలో అధికారులు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.